logo

పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!

పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ కలికిరి మురళీ మోహన్‌ అన్నారు.

Published : 23 Apr 2024 05:19 IST

కొనసాగిన నామినేషన్ల పర్వం

చిత్తూరు కలెక్టరేట్‌, తవణంపల్లె, న్యూస్‌టుడే: పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ కలికిరి మురళీ మోహన్‌ అన్నారు. రంగంపేట క్రాస్‌ నుంచి సోమవారం భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టులో మూడుసార్లు తెదేపాను ఓడించారని,  గెలిచిన ఎమ్మెల్యేలు చెప్పుకొనేలా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఏమీ చేయలేని ఎమ్మెల్యేలు మళ్లీ ఓటు కోసం మన ముందుకు వస్తున్నారన్నారు. తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, తెదేపా మండలాధ్యక్షులు దొరబాబుచౌదరి, దిలీప్‌నాయుడు, గిరి నాయుడు, మురార్జీయాదవ్‌, జయప్రకాష్‌నాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకటేశ్వరచౌదరి, లత, కాణిపాకం ఆలయ మాజీ ఛైర్మన్‌ మణినాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌: చిత్తూరు పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థి రెడ్డెప్ప, రెడ్డెమ్మ, నేషనల్‌ మహాసభ పార్టీ అభ్యర్థి జానకిరామారావు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అసెంబ్లీ స్థానానికి పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఆర్వో, జేసీ శ్రీనివాసులుకు అందజేశారు. తెదేపా అభ్యర్థి జగన్మోహన్‌ సతీమణి ప్రతిమ, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి భార్య ఇందుమతి నామినేషన్లు వేశారు.  నగరి: అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పి.డి.నారాయణస్వామి మొదలి నామినేషన్‌ దాఖలు చేశారని ఆర్వో కె.వెంకటరెడ్డి తెలిపారు. ‌్ర పూతలపట్టు అసెంబ్లీ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా నాగేశ్వర తమ పత్రాలు ఆర్వో చిన్నయ్యకు అందజేశారు. పెనుమూరు, జీడీనెల్లూరు: అసెంబ్లీ స్థానానికి తెదేపా తరఫున రవికుమార్‌ కుటుంబీకులతో కలిసి నామినేషన్‌ వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని