logo

వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు

సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్‌ నామినేషన్‌ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.

Published : 24 Apr 2024 03:05 IST

నామినేషన్‌ కేంద్రానికి వెలుపల రహదారిపై వైకాపా కార్యకర్తల జనసందోహం

వరదయ్యపాళెం: సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్‌ నామినేషన్‌ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు. నామినేషన్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉండటంతో వంద మీటర్ల దూరం వరకు నలుగురిని మాత్రమే అనుమతించాల్సి ఉండగా, భారీ ర్యాలీగా నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్న రాజేష్‌ వెంట వందలాది మంది కార్యకర్తలు కేంద్రం ఆవరణలో రహదారిపై నినాదాలు చేయడం విమర్శలకు దారితీసింది. నామినేషన్‌ కేంద్రం వెలుపల రహదారి వద్దే ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ గురుమూర్తి విలేకర్ల సమావేశం నిర్వహిస్తున్నా పోలీసులు చూస్తూ మౌనం వహించారు.

నగదు పంపిణీలో నాయకుల మధ్య గొడవ 

వైకాపా ర్యాలీ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి జనసమీకరణ చేపట్టారు. వరదయ్యపాళెంలో నగదు పంపిణీలో తేడాలపై నాయకుల మధ్య వివాదానికి దారితీసింది. కడూరు ఎస్సీకాలనీ నుంచి 35 మందిని తీసుకొస్తే 25 మందికే నగదు ఇస్తే మిగిలిన పది మందికి డబ్బు ఎవరిస్తారంటూ ఆ పంచాయతీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మండల నాయకులతో వాగ్వాదానికి దిగారు. వరదయ్యపాళెంలోని ఓ కల్యాణ మండపం వద్ద మండల స్థాయి ప్రజాప్రతినిధులను వారు నిలదీస్తూ, కేవలం నగదు స్వాహా చేసేందుకు పది మంది పేర్లు చెప్పి తాము అబద్ధాలతో మోసం చేసేవారమా అంటూ వారిపై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని