logo

‘జగన్‌కు ఆ నలుగురే మిగిలారు’

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్‌కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం ఎద్దేవా చేశారు.

Published : 28 Apr 2024 02:57 IST

జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మునిరత్నం, నరేష్‌, శివశంకర్‌

కుప్పం పట్టణం: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్‌కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం ఎద్దేవా చేశారు. భాజపా, జనసేన నాయకులు శివశంకర్‌, శివసేనతో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక వైకాపా పాలన అంతమే కూటమి పంతమని అన్నారు. ఐదేళ్ల పాలనపై ఎన్డీయే ఛార్జిషీట్‌ విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించడానికి 27 పథకాలు రద్దు చేశారన్నారు. ఆదాయం లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమి ఏర్పడిందన్నారు. అనంతరం జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాంబశివం, సత్యేంద్రశేఖర్‌, రవి, ఆర్ముగం ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని