logo

పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి: ఎసీ్ప

పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రంపచోడవరం, చింతూరు అదనపు ఎస్పీలు, ఇతర ఎస్‌డీపీవో

Published : 23 Jan 2022 02:59 IST


మాట్లాడుతున్న రవీంద్రనాథ్‌బాబు

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రంపచోడవరం, చింతూరు అదనపు ఎస్పీలు, ఇతర ఎస్‌డీపీవోలు, వివిధ విభాగాల డీఎస్పీలతో శనివారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులు, పోక్సో, వరకట్న వేధింపులు, లాంగ్‌ పెండింగ్‌ కేసుల విచారణను నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఛార్జ్‌షీట్లను గౌరవ న్యాయస్థానాల్లో సమర్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిర్వహిస్తున్న నో యాక్సిడెంట్‌ డే కార్యక్రమాన్ని డీఎస్పీలు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కరణం కుమార్‌, ఎస్బీ డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ లక్ష్మణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని