logo

మా అందరి స్వస్థలం పిఠాపురం

తమ స్వస్థలం పిఠాపురంగా భావిస్తున్నామని మెగా ప్రిన్స్‌ కొణిదెల వరుణ్‌తేజ్‌ అన్నారు. పి

Published : 28 Apr 2024 03:56 IST

మాట్లాడుతున్న వరుణ్‌తేజ్‌

గొల్లప్రోలు: తమ స్వస్థలం పిఠాపురంగా భావిస్తున్నామని మెగా ప్రిన్స్‌ కొణిదెల వరుణ్‌తేజ్‌ అన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా వరుణ్‌తేజ్‌ గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో శనివారం సాయంత్రం నుంచి రోడ్‌షో నిర్వహించారు. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని తమ కుటుంబం మొత్తం సొంత ఊరుగా చేసుకుంటామన్నారు. నిత్యం ప్రజలకోసమే జనసేనాని ఆలోచిస్తారన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు.

ప్రచారంలో పాల్గొన్న జనం

జనసైనికుల ఉత్సాహం: వరుణ్‌తేజ్‌కు గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది.  చెందుర్తి, దుర్గాడ గ్రామాలకు వరుణ్‌తేజ్‌ వచ్చే సరికి సమయం రాత్రి 9 గంటలైనా అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి అమ్మవారిని వరుణ్‌తేజ్‌ దర్శించుకున్నారు. వన్నెపూడి గ్రామంలోని దత్తాత్రేయస్వామి వారికి ప్రచార రథంలో నుంచే నమస్కరించారు. తాటిపర్తి గ్రామంలో రోడ్‌షో నిర్వహించే సమయంలో ప్రచార రథం క్లచ్‌ ప్లేట్లు కాలిపోవడంతో కొంతదూరంపాటు కారులోనే పర్యటిస్తూ ప్రచారం సాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని