logo

కేవీకేలకు డ్రోన్‌ల పంపిణీ

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రెడ్డిపల్లి, ఉండి కేవీకేలకు, మార్టేరు ప్రాంతీయ పరిశోధన స్థానానికి వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి డ్రోన్‌లను పంపిణీ చేశారు.

Published : 31 May 2023 05:48 IST

డ్రోన్‌లు అందజేస్తున్న ఎన్జీ రంగా వర్సిటీ ఉపకులపతి విష్ణువర్ధన్‌రెడ్డి

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రెడ్డిపల్లి, ఉండి కేవీకేలకు, మార్టేరు ప్రాంతీయ పరిశోధన స్థానానికి వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి డ్రోన్‌లను పంపిణీ చేశారు. గుంటూరు సమీపంలోని లాంఫాంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయా డ్రోన్‌లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగ ప్రదర్శన చేపట్టేందుకు, రైతులకు అవగాహన కల్పించేందుకు వీటిని అందిస్తున్నామన్నారు. కేవీకేలకు అటారి జోన్‌టెన్‌ ఆర్థిక సహకారంతోనూ, మార్టేరు పరిశోధన స్థానానికి ఎస్సీ, ఎస్టీ పథకం కింద డ్రోన్లను సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ ఎ.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని