logo

ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం

కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 28 Apr 2024 05:25 IST

స్థానికులతో మాట్లాడుతున్న నాదెండ్ల

తెనాలి టౌన్‌: కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 33, 34 వార్డుల్లో శనివారం సాయంత్రం ఆయన పర్యటించారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజవర్గంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తామని మనోహర్‌ హామీ ఇచ్చారు. వార్డుల్లో పలు చోట్ల ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు వైకాపా నాయకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

కొల్లిపర: జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు ఆళ్ల వీరారెడ్డి అన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు శనివారం మున్నంగిలో పర్యటించారు.

కొల్లిపర: అభివృద్ధి సంక్షేమం కోసం తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ను గెలిపించుకుందామని జనసేన నాయకురాలు రాయపాటి అరుణ అన్నారు. శనివారం కొల్లిపర, గుదిబండివారిపాలెం, తూములూరు, చింతపాలెం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


‘జనసేన నాయకులపై కేసులు పెట్టించిన అంబటి’

పొన్నూరు: సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన ఘనత పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణకే దక్కుతుందని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. మండల పరిధి చింతలపూడిలోని ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొన్నూరులో రాజకీయ మహానటుడు వైకాపా అభ్యర్థిని, అయనకు అస్కార్‌ కంటే మించిన అవార్డు అందిచవచ్చని వెల్లడించారు. ప్రజా సేవ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చానని చెబుతున్న ఆయన 2019లో సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు తరఫున డమ్మీ నామినేషన్లు వేసిన మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు. మురళీకృష్ణ అవినీతి చరిత్రను వాస్తవాలతో ప్రజలు ముందు త్వరలో ఉంచుతామని ప్రకటించారు.

తెదేపాలో చేరిక: పొన్నూరు : మండలంలోని పచ్చల తాటిపర్రుకి చెందిన వైకాపా నాయకుడు హరీ రామకృష్ణ తెదేపాలో చేరారు. ఈ మేరకు చింతలపూడిలోని ఎన్డీయే కూటమి పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని