logo

మాకు ఏం చేశారని ఓటెయ్యాలి

మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు.

Published : 28 Apr 2024 05:26 IST

నిలదీసిన వృద్ధురాలు
మంగళగిరి వైకాపా అభ్యర్థినికి చేదు అనుభవం

వైకాపా నాయకులను నిలదీస్తున్న వృద్ధురాలు

మంగళగిరి:  మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు. ‘ఏముందని వేస్తామమ్మా.. మాకు ఏమి చేశారని వేస్తాం చెప్పండి. పలానాది చేశాడని చెప్పండీ వేస్తాం’. అని అనడంతో అంతా అవాక్కయ్యారు. దీంతో ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం ఆ వృద్ధురాలు తన ఆవేదనను స్థానికులతో చెబుతూ ‘వెయ్యం..వెయ్యం.. మాకేమీ ఇవ్వలా.. మాకేమీ చేయలా.. అందుకని మేము ఓటు వెయ్యం..ఆఖరికి మాకున్న రేషన్‌ కార్డు కూడా తీసేశారు.. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్లకే వేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని