logo

రూపు మారిన ఆస్తి దస్త్రం

ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు జగన్‌ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్‌ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది.

Published : 29 Apr 2024 05:53 IST

 వివరాలు నమోదు చేసి ప్రింటు తీస్తే రిజిస్ట్రేషన్‌ అయిపోయినట్లే
 పల్నాడు జిల్లాలో పెదకూరపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎంపిక

 ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు జగన్‌ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్‌ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. ఇందులో వినియోగదారుడికి ఆస్తి పత్రంలో తగిన వివరాలు నమోదు చేసుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది. తాజాగా వచ్చిన విధానంలో అటువంటి అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో పేర్కొన్న వివరాలు నమోదు చేస్తే దాన్ని సబ్‌రిజిస్ట్రార్‌ పరిశీలించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం ప్రింటు తీసుకుని వెళ్లిపోవచ్చు. ఇక నుంచి దాన్నే ఆస్తి దస్త్రంగా పరిగణిస్తారు. ఈ విధానంపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ఇటువంటి విధానపరమైన నిర్ణయాలు అమలు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పాటు మన జిల్లాలో పెదకూరపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి ఎంపిక చేశారు. ఇకపై ఇక్కడ ఈ విధానమే అమలుకానుంది. ఈ కొత్త విధానంలో కొనుగోలు, అమ్మకందారులు వారికి నచ్చిన వివరాలు పొందుపరచడానికి వీలుపడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని