logo

కాళేశ్వరం జలాలతో నగర దాహార్తికి చెక్‌

కాళేశ్వరం జలాలను అందించడం ద్వారా నగరంలో తాగునీటి సమస్య అనేది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 25 Jan 2022 02:07 IST

30 ఏళ్లు తాగునీటి సమస్యే ఉండదు

రూ.6 వేల కోట్లతో ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక


ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం మాట్లాడుతున్న కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, నార్సింగి: కాళేశ్వరం జలాలను అందించడం ద్వారా నగరంలో తాగునీటి సమస్య అనేది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కొండపోచమ్మ సాగర్‌, మల్లన్నసాగర్‌ నుంచి అవుటర్‌ రింగ్‌ మెయిన్‌కు అనుసంధానం చేసి నగరానికి నీటిని సరఫరా చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) పరిధిలోని నగర శివారు గ్రామాలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో చేపడుతున్న ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌- 2లోని పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓఆర్‌ఆర్‌ పరిధిలో మొదటి విడతలో రూ.775 కోట్ల ప్రాజెక్టుతో 194 గ్రామాలకు సురక్షిత నీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఫేజ్‌- 2 చేపట్టామన్నారు. ప్రస్తుత అవసరాలు తీర్చడంతో పాటు రానున్న 30 ఏళ్ల నగర తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూ.6 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని