logo

తెలంగాణ భాష సంస్కారవంతమైంది

తెలంగాణ భాష ఎంత గొప్పదో పోతన, పాల్కుర్కి, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, కాళోజీలలో ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు

Published : 02 May 2024 02:18 IST

మలయశ్రీకి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి
నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ భాష ఎంత గొప్పదో పోతన, పాల్కుర్కి, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, కాళోజీలలో ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా.ఎం.శ్రీధర్‌రెడ్డి ధర్మనిధి సాహిత్య పురస్కార ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  కవి, రచయిత డా.ఎం.శ్రీధర్‌రెడ్డి పేరుతో ఆయన సతీమణి డా.బి.విజయలక్ష్మీ సారస్వత పరిషత్తులో నెలకొల్పిన సాహిత్య పురస్కారాన్ని శతాధిక గ్రంథకర్త కరీంనగర్‌కు చెందిన మలయశ్రీకి అందజేశారు. పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి,  ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య, పలువురు పూర్వ న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని