logo

Talasani: ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులివ్వరు: తలసాని

నంది అవార్డుల వివాదంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు.

Updated : 04 May 2023 17:07 IST

హైదరాబాద్‌: నంది అవార్డుల వివాదంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరూ సర్కారుకు ప్రతిపాదన పంపలేదని తెలిపారు. పురస్కారాలు ఇవ్వాలని ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. అయినా.. ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇస్తామని ఆయన ప్రకటించారు.

కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్‌ చేయనున్న నేపథ్యంలో ఇటీవల నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినిదత్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదని, ఇప్పుడు తన ఉద్దేశంలో ఆ అవార్డుకు విలువ లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఎవరి పేరూ ఎత్తకుండా మంత్రి తలసాని తనదైన శైలిలో స్పందించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని