logo

శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి స్థిరాస్తులు రూ.118 కోట్లు

శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వి.జగదీశ్వర్‌ గౌడ్‌ తనకు రూ.118.62 కోట్ల స్థిరాస్తులు, రూ.5.86 కోట్ల చరాస్థులున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Published : 04 Nov 2023 03:45 IST

నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తున్న జగదీశ్వర్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌- శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వి.జగదీశ్వర్‌ గౌడ్‌ తనకు రూ.118.62 కోట్ల స్థిరాస్తులు, రూ.5.86 కోట్ల చరాస్థులున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరెడ్డికి కార్యాలయంలో జగదీశ్వర్‌గౌడ్‌ శుక్రవారం తన నామినేషన్‌ సమర్పించారు. నామినేషన్‌ పత్రాలతోపాటు ఆస్తులు, అప్పుల వివరాలు జతపరిచారు. తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ.83లక్షల విలువైన మెర్సిడెస్‌ బెంజ్‌ కారు, తన భార్య పూజిత వద్ద 500 గ్రాముల బంగారు ఆభరణాలున్నట్టు వివరించారు. వివిధ బ్యాంకుల్లో అప్పులు రూ.2.21కోట్లున్నాయని పేర్కొన్నారు.

స్థిరాస్తులు ఇలా... వ్యవసాయ భూములు సంగారెడ్డి జిల్లా వెల్లటూరు, మిర్‌దొడ్డి గ్రామాల్లో ఉన్నాయి. వ్యవసాయేతర భూములు శేరిలింగంపల్లి మండలం నల్లగండ్లలో 9.28 ఎకరాలు, 9347 చదరపు గజాల స్థలం ఉంది. మాదాపూర్‌ మై హోం హబ్‌లో ఒక ఫ్లాట్‌, హిమాయత్‌నగర్‌లో ఒక ఫ్లాట్‌, నల్లగండ్లలో ఒక ఫ్లాట్‌, శేరిలింగంపల్లిలో మరో ఫ్లాట్‌ ఉన్నాయి. రెండుచోట్ల పెంట్‌ హౌస్‌లు, ఒక విల్లా, శేరిలింగంపల్లిలోని అపర్ణ సైబర్‌ జోన్‌లో 28 ఫ్లాట్లున్నాయి.

జగదీశ్వర్‌గౌడ్‌ - రూ.113,20,49,900

పూజిత(భార్య) - రూ.4,63,94,900

హారిక(కుమార్తె) - రూ.40,00,000

వైభవ్‌(కుమారుడు) - రూ.38,00,000

చరాస్తులు..

జగదీశ్వర్‌గౌడ్‌ - రూ.5,27,33,483

పూజిత - రూ.59,00,889

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని