logo

సమాజాన్ని ప్రభావితం చేసేది రచయితలే

వివిధవర్గాల ప్రజలతో కూడిన సమాజాన్ని ప్రభావితం చేసేందుకు కవులు, రచయితలు, కళాకారులు ముఖ్య పాత్ర పోషించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు.

Updated : 20 Feb 2024 05:43 IST

 

సావనీర్‌ ఆవిష్కరణలో జూలూరు గౌరీశంకర్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రొ.రమా మెల్కొటే

రాంనగర్‌, న్యూస్‌టుడే: వివిధవర్గాల ప్రజలతో కూడిన సమాజాన్ని ప్రభావితం చేసేందుకు కవులు, రచయితలు, కళాకారులు ముఖ్య పాత్ర పోషించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు సభ సోమవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, నేటితరం చిన్నారులు సహా యువత సెల్‌ఫోన్లు, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతున్నారన్నారు. వాటి నుంచి బయట పడేందుకు పుస్తక పఠనమే సరైన మార్గమన్నారు. బుక్‌ ఫెయిర్‌ భిన్న భావాలకు కూడలి అని, విభిన్న సంఘర్షణల కలయిక అని తెలిపారు. సమాజంలోని అంతరాలు, అసమానతలను రూపుమాపేందుకు పుస్తకాలు దోహదం చేస్తాయన్నారు. 2014 నుంచి 2024 వరకు ‘పుస్తక పండగ’ పేరుతో రూపొందించిన సావనీర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ స్టాళ్లను సందర్శించి పలు పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, ప్రొ.రమా మెల్కోటే, ఓయూ వీసీ డి.రవీందర్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ, బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, కార్యదర్శి ఆర్‌.వాసు, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, చంద్రమోహన్‌, కోశాధికారి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని