logo

అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు

వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

Updated : 28 Apr 2024 08:03 IST

 

నిజామాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన మజర్‌, అమర్‌ అన్నదమ్ములు. ప్లంబింగ్‌ పనిచేసుకునే అమర్‌కు ఏడాది కిందట హైదరాబాద్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆ యువతిని తన తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మజర్‌ ఏడాది నుంచి అడ్డుకుంటున్నాడు. అయినా వినకుండా అమర్‌ శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అన్న కోపం పెచుకున్నాడు. నూతన దంపతులు శాంతినగర్‌లో అమ్మాయి అమ్మమ్మ ఇంట్లో ఉన్నారని తెలిసి శుక్రవారం అర్ధరాత్రి మజర్‌ తన స్నేహితులు సల్మాన్‌, ఇలియాస్‌, సమీర్‌, ఇమ్రాన్‌లతో కలిసి వెళ్లి ఆ ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెళ్లికి వచ్చిన కానుకలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో అశోక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని