icon icon icon
icon icon icon

Amit Shah: మిగులు బడ్జెట్‌ రాష్ట్రం అప్పులపాలయ్యింది: అమిత్‌ షా

మిగులు బడ్జెట్‌ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. గతంలో భారాస అప్పులు చేసినట్లే కాంగ్రెస్‌ కూడా చేస్తోందని ఆరోపించారు.

Published : 11 May 2024 16:33 IST

హైదరాబాద్‌: మిగులు బడ్జెట్‌ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. గతంలో భారాస అప్పులు చేసినట్లే కాంగ్రెస్‌ కూడా చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. 

‘‘ మరోసారి కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం. 11 చోట్ల విజయావకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మోదీ పాలనలో ఉగ్రవాద దాడులు లేవు. తెలంగాణలో రామగుండం ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ నిర్మించాం. సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశాం. ఇలా ఎన్నో కీలక సంస్థలను నెలకొల్పాం. తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్‌ ఇప్పటికీ ఓవైసీ చేతిలోనే ఉంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకావడం లేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. అదీ లేదు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదు. కౌలు రైతులకు రూ.15వేల ఆర్థిక సాయం లేదు. విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోంది. నా వీడియోను ఎడిట్‌ చేసి తప్పుడు ప్రచారం చేశారు.  కాంగ్రెస్‌ వస్తే.. మళ్లీ ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తారు’’ అని అమిత్‌ షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img