logo

దేశం భాజపానే కోరుకుంటోంది: విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పరిగి, కుల్కచర్ల, పూడూరు మండలాలతోపాటు వికారాబాద్‌లో జరిగిన వివిధ సభల్లో ఆయన పాల్గొన్నారు.

Published : 30 Apr 2024 02:26 IST

వికారాబాద్‌లో మాట్లాడుతున్న విశ్వేశ్వర్‌రెడ్డి

న్యూస్‌టుడే, పరిగి, కుల్కచర్ల, వికారాబాద్‌ టౌన్‌, పూడూరు: చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పరిగి, కుల్కచర్ల, పూడూరు మండలాలతోపాటు వికారాబాద్‌లో జరిగిన వివిధ సభల్లో ఆయన పాల్గొన్నారు. పరిగి పట్టణంలో జరిగిన ఓబీసీ మోర్చా చేవెళ్ల పార్లమెంట్‌ స్థాయి సామాజిక సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయనకు మద్దతుగా విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి తమకు పోటీ కాదని ప్రజలకు ఇప్పటికీ ఆయన ఎవరో తెలియదన్నారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి టి.వీరేందర్‌గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆనంద్‌గౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఆశ్వరప్ప మాట్లాడారు. పార్టీ జిల్లా నాయకులు వెెంకటయ్య, రాముయాదవ్‌, పెంటయ్యగుప్త, నర్సిములు, తాండూరు, పరిగి, వికారాబాద్‌, చేవెళ్ల ప్రాంతాలకు చెందిన వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి బాధ్యత నాదే..: చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో యువతీ, యువకులకు ఉపాధిమార్గం చూపించే బాధ్యత తాను తీసుకుంటానని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ పట్టణంలో జరిగిన యువమోర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

  • ధర్మాన్ని కాపాడుతున్న మోదీ వైపే దేశప్రజలు ఉన్నారని కొండా సోమవారం రాత్రి కుల్కచర్ల మండల కేంద్రంలో చిన్నగేటు నుంచి ప్రధాన చౌరస్తా వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
  • అర్హులైన ప్రతిఒక్కరికీ పక్కా ఇళ్లు కల్పించటంతో పాటు ఉపాధి కోసం రుణాలు ఇస్తామని కొండా అన్నారు. పూడూరు మండల కేంద్రంలో జరిగిన పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులు మల్లేశ్‌ పటేల్‌, పార్టీ మండల అధ్యక్షులు రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని