logo

ఎన్నికల బరిలో 99మంది

ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది..

Published : 30 Apr 2024 06:13 IST

కరీంనగర్‌లో 28.. పెద్దపల్లిలో 42.. నిజామాబాద్‌లో 29 మంది
15 నామినేషన్ల ఉపసంహరణ

నిజామాబాద్‌ : అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, చిత్రంలో అదనపు పాలనాధికారి అంకిత్‌, సాధారణ పరిశీలకురాలు ఎలిస్‌వజ్‌, ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌

కరీంనగర్‌ (ఈనాడు), పెద్దపల్లి కలెక్టరేట్‌, నిజామాబాద్‌ కలెక్టరేట్‌ (న్యూస్‌టుడే) : ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులతోపాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ స్థానంలో ఈసారి రసవత్తర పోరు జరగనుంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో భారీగానే అభ్యర్థులు ఎన్నికలకు సై అన్నారు. కరీంనగర్‌ స్థానంలో 28 మంది పోటీ పడుతుండగా.. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 42 మంది రంగంలో ఉన్నారు. ఇక నిజామాబాద్‌లోనూ 29 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీలో నిలిచారు. కరీంనగర్‌లో అయిదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు, నిజామాబాద్‌లో కేవలం ముగ్గురు మాత్రమే పోటీ నుంచి వైదొలిగారు.

రెండు.. మూడు ఈవీఎం బ్యాలెట్‌లు..

కరీంనగర్‌, నిజామాబాద్‌ స్థానాల్లో రెండు చొప్పున, పెద్దపల్లిలో మూడు ఈవీఎం బ్యాలెట్‌లను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఒక ఈవీఎం బ్యాలెట్‌లో గరిష్ఠంగా 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. 15 మంది అభ్యర్థులతోపాటు నోటా కలిపి ఒకటి ఏర్పాటు చేస్తారు. 15 మంది, అంతకకన్నా తక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే నోటాతో కలిపి ఒక ఈవీఎం సరిపోతుంది. కానీ కరీంనగర్‌లో 28 మంది ఉండటం వల్ల రెండో ఈవీఎం ఏర్పాటు అనివార్యమైంది. ఇదే విధంగా నిజామాబాద్‌లోనూ 29 మంది ఉండటంతో అక్కడా ఇదే పరిస్థితి. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మాత్రం 42 మంది అభ్యర్థులు ఉండటం వల్ల మూడో ఈవీఎం బ్యాలెట్‌ను వినియోగించాల్సి వస్తోంది. ఈ దిశగా జిల్లా ఎన్నికల అధికారులు అదనంగా అవసరమైన బ్యాలెట్‌ ఈవీఎంల కోసం రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించి వాటిని త్వరలో తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. అభ్యర్థుల పేర్లలోని మొదటి అక్షర క్రమంలో బ్యాలెట్‌లో వారికి వరుస సంఖ్యను కేటాయించారు.

కరీంనగర్‌లో..

బండి సంజయ్‌కుమార్‌ (భాజపా), బోయినపల్లి వినోద్‌కుమార్‌ (భారాస), వెలిచాల రాజేందర్‌రావు (కాంగ్రెస్‌), మారెపల్లి మొగిలయ్య(బీఎస్పీ)లు ప్రధాన పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. వీరికి పోటీగా గుర్తింపు పొందిన పార్టీల తరపున చింత అనిల్‌కుమార్‌ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), తాళ్లపల్లి అరుణ (అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ) పంచిక అశోక్‌ (సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), గట్టు రాణా ప్రతాప్‌ (సోషలిస్ట్‌ పార్టీ ఇండియా), పెద్దపల్లి శ్రవణ్‌ (భారతీయ యువకుల దళం), కడ్తాల అనిల్‌రెడ్డి (నేషనల్‌ నవక్రాంతి పార్టీ), పొడిశెట్టి సమయ్య (బహుజన ముక్తి పార్టీ), చిలువేరు శ్రీకాంత్‌(ధర్మసమాజ్‌ పార్టీ), చీకోటి వరుణ్‌కుమార్‌ గుప్తా (తెలుగు కాంగ్రెస్‌ పార్టీ)లు రంగంలో నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా పేరాల మానస, ద్యాగల వెంకట నర్సయ్య,  కట్కూరి అనోస్‌, వేముల విక్రంరెడ్డి, శివరాత్రి శ్రీనివాస్‌, గడ్డ సతీశ్‌, బరిగె గట్టయ్య యాదవ్‌, గుడిసె మోహన్‌, మేకల అక్షయ్‌కుమార్‌, కోట శ్యాంకుమార్‌, పోతూరి రాజేందర్‌, గవ్వల లక్ష్మి, అబ్బడి బుచ్చిరెడ్డి, దేవునూరి శ్రీనివాస్‌, రాపోల్‌ రామ్‌ కుమార్‌ భరద్వాజ్‌లు పోటీకి సిద్ధమయ్యారు.

నిజామాబాద్‌ స్థానంలో..

ధర్మపురి అర్వింద్‌ (భాజపా), బాజిరెడ్డి గోవర్ధన్‌ (భారాస), తాటిపర్తి జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), లింబాద్రి (బీఎస్పీ), అశోక్‌గౌడ్‌ (బహుజన లెఫ్ట్‌), అలీ మన్సూర్‌ (అన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌), సుమన్‌ (డీఎస్పీ), సాయి కృష్ణమూర్తి (యుగ తులసి), నగేష్‌ (దళిత బహుజన), దేవతి శ్రీనివాస్‌ (బహుజన ముక్తి), భూక్యా నందు (విద్యార్థుల రాజకీయ పార్టీ), రాజ్‌ కుమార్‌ (ఇండియా ప్రజాబంధు), యోగేందర్‌ (అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ), ఆరె రాజేందర్‌, కొత్త కొండ శక్తిప్రసాద్‌, కోటగిరి శ్రీనివాస్‌, గంట చరితారావు, గోపి చంద్రయ్య, జీవన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, బీబీ నాయక్‌, సాయి నిఖిల్‌, ప్రశాంత్‌, మలావత్‌ విఠల్‌, రాగి అనిల్‌, రాపల్లి సత్యనారాయణ, రేపల్లి శ్రీనివాస్‌, విక్రమ్‌రెడ్డి, సయ్యద్‌ అస్గర్‌ (స్వతంత్రులు) బరిలో ఉన్నారు.

పెద్దపల్లిలో మిగిలింది వీరే..

పెద్దపల్లిలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి ఇరుకుల్ల రాజనర్సయ్య(బీఎస్పీ), ఈశ్వర్‌ కొప్పుల(భారాస), వంశీకృష్ణ గడ్డం(కాంగ్రెస్‌), శ్రీనివాస్‌ గోమాసె(భాజపా), రిజిస్టర్డు పార్టీల నుంచి ఇరుగురాల భాగ్యలక్ష్మి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), ఎ.సుమలత(అలయన్స్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌), కనకయ్య ములకల(సోషలిస్ట్‌ పార్టీ-ఇండియా), కాశి సతీశ్‌కుమార్‌ (యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ), కంది చందు(రాష్ట్రీయ మానవ్‌), చిలుక ఆనంద్‌(యువతరం), దుర్గం సంతోష్‌ (ప్రజారాజ్యసమితి), రామ్‌చందర్‌ నిచ్చకోల(దళిత బహుజన), మొలుగు వెంకటేశ్‌ (న్యూ ఇండియా), మోతె నరేశ్‌(పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(డెమోక్రటిక్‌), రమేశ్‌ మంద(ధర్మ సమాజ్‌ పార్టీ), మొయ్యి వేణుగోపాల్‌(బహుజన్‌ ముక్తి), స్వతంత్రులుగా అక్కపాక తిరుపతి, ఆర్నకొండ రాజు, ఇరికిల్ల రాజేశ్‌, కె.సందీప్‌, కాదాసి శేఖర్‌, కుర్మ మహేందర్‌, లింగమూర్తి కొంకటి, గడ్డం మారుతి, చందనగిరి శ్రీనివాస్‌, జూపాక కిరణ్‌, తాళ్లపల్లి నరేశ్‌, దాగం శ్రీనివాస్‌, దుర్గం రాములు, దూడ మహిపాల్‌, జనగామ నరేశ్‌, నవీన్‌ నూకల, బూడిద తిరుపతి, బొట్ల చంద్రయ్య, మామిడిపెల్లి బాపయ్య, ముల్కల్ల రాజేంద్రప్రసాద్‌, అక్షయ్‌కుమార్‌ మేకల, రాజేశం రాచర్ల, దుర్గం రాజన్న, రాముల కార్తీక్‌, ప్రొఫెసర్‌ నతానియేలు, శ్రీనివాస్‌ పంతుకాల బరిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు