logo

‘ఐస్‌క్రీమ్‌ మ్యాన్‌’ ఇకలేరు

ఐస్‌క్రీముల రాజధాని మంగళూరులో ‘ఐస్‌క్రీమ్‌ మ్యాన్‌’గా గుర్తింపు దక్కించుకున్న రఘునందన్‌ కామత్‌ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

Published : 19 May 2024 04:00 IST

రఘునందన్‌ కామత్‌

మంగళూరు, న్యూస్‌టుడే : ఐస్‌క్రీముల రాజధాని మంగళూరులో ‘ఐస్‌క్రీమ్‌ మ్యాన్‌’గా గుర్తింపు దక్కించుకున్న రఘునందన్‌ కామత్‌ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ముంబయిలో 1984లో నేచురల్స్‌ ఐస్‌క్రీమ్‌ను మొదటిసారిగా ఆయన విక్రయించారు. ప్రస్తుతం 40కు పైగా నగరాల్లో 140కు పైగా శాఖలతో ఏటా రూ.400 కోట్ల వ్యాపారాన్ని సంస్థ నిర్వహిస్తోంది. సహజమైన పండ్లను ఉపయోగించి, ఐస్‌క్రీమ్‌లను తయారు చేయడం, రసాయనాలు వాడకపోవడంతో వినియోగదారుల విశ్వాసాన్ని దక్కించుకున్నారు. ముల్కిలో పేద కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి పండ్ల వ్యాపారి. తన సోదరునితో కలిసి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హోటల్‌లో పని చేసేందుకు ముంబయికి చేరుకున్నారు. తనకు 30 ఏళ్లు వచ్చే సరికి సొంతంగా హోటల్‌ పెట్టారు. ఆ తర్వాత ‘నేచురల్స్‌ ఐస్‌క్రీమ్స్‌’ సంస్థను నెలకొల్పిన తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. కామత్‌ మృతికి మంగళూరులో ఐస్‌క్రీమ్‌ వ్యాపారుల సంఘం సభ్యులు నివాళి అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని