logo

బుగ్గన నామినేషన్‌ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తాం: తెదేపా

బుగ్గన నామినేషన్‌ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని తెదేపా లీగల్‌సెల్‌న్యాయవాదులు శ్రీనివాసభట్టు, కోట్లహరిశ్చంద్రారెడ్డి, నాగేశ్వరరావుయాదవ్‌, శ్రీనివాసులు పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 02:34 IST

మాట్లాడుతున్న న్యాయవాది శ్రీనివాసుభట్టు తదితరులు

డోన్‌, న్యూస్‌టుడే: బుగ్గన నామినేషన్‌ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని తెదేపా లీగల్‌సెల్‌న్యాయవాదులు శ్రీనివాసభట్టు, కోట్లహరిశ్చంద్రారెడ్డి, నాగేశ్వరరావుయాదవ్‌, శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక తెదేపా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధన ప్రకారం ఫారం26ఏలోని కాలమ్స్‌లో అన్నీ పూరించకపోయినా, సమాచారాన్ని ఇవ్వకపోయినా నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురవుతాయని తెలిపారు. నామినేషన్‌కు సంబంధించిన అఫిడవిట్‌లో ఆస్తులను సక్రమంగా కనపర్చలేదని ఆర్వోకు ఫిర్యాదు చేశామన్నారు.  ఫిర్యాదుల విషయంలో నిర్ణయాన్ని విచారణ జరపకుండానే ఆమోదిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై  న్యాయపోరాటం చేయబోతున్నామన్నారు. రాష్ట్రఎన్నికల కమిషనర్‌తో పాటు, కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని