logo

‘ఆమె’ చేతిలో గెలుపు

సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది.

Updated : 28 Apr 2024 04:43 IST

ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది. ఆరు నియోజకవర్గాల్లో 13,89,307 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,89,402 మంది, మహిళలు 7,08,647 మంది ఓటర్లు ఉన్నారు. థర్డ్‌జండర్‌ ఓటర్లు 258 మంది ఉన్నారు.

నంద్యాలలో అధికం..

జిల్లా కేంద్రం నంద్యాలలో అత్యధికంగా 2,73,938 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116 మంది ఓటర్లు ఉన్నారు.

17,216 మంది పెరిగారు

మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 17,216 ఓట్లు పెరిగాయి. అత్యధికంగా జిల్లా కేంద్రం నంద్యాలలో 6,293 ఓట్లు పెరిగాయి. ఆ తర్వాత డోన్‌ లో 3,240, బనగానపల్లిలో 2,279, శ్రీశైలంలో 2,154, ఆళ్లగడ్డలో 1762, నందికొట్కూరులో 1488 ఓట్లు పెరిగాయి. ఇదే సమయంలో థర్డ్‌ జండర్‌ ఓట్లు నాలుగు తగ్గాయి. 262 ఓట్ల నుంచి 258 ఓట్లకు తగ్గాయి.

ఎక్కడ ఎంత మంది

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,754 మంది ఎక్కువగా ఉన్నారు. శ్రీశైలంలో 4,530 , నందికొట్కూరులో 4,651 , నంద్యాలలో 7,864, బనగానపల్లిలో 4,931, డోన్‌ నియోజకవర్గంలో 3,515 మంది మహిళలలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని