logo

Jadcherla: లాకప్‌లో కోడిపుంజు.. ఇంతకీ దొంగ ఎవరు?

లాకప్‌లో కోడిపుంజును ఉంచిన ఆసక్తికర ఘటన జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. జడ్చర్ల పురపాలిక పరిధి బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ బాలుడు కోడిపుంజును తీసుకెళ్తుండగా..

Updated : 11 Jul 2023 08:41 IST


న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం: లాకప్‌లో కోడిపుంజును ఉంచిన ఆసక్తికర ఘటన జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. జడ్చర్ల పురపాలిక పరిధి బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ బాలుడు కోడిపుంజును తీసుకెళ్తుండగా.. గమనించిన స్థానికులు చోరీ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది వచ్చి బాలుడితో పాటు కోడిపుంజును ఠాణాకు తీసుకొచ్చారు. నిందితుడు మైనర్‌ కావటంతో తల్లిదండ్రులకు పిలిపించి వారికి అప్పగించారు. కోడిపుంజు ఎవరిదో తెలియలేదు. ఎవరి నుంచీ ఫిర్యాదు రాలేదు. కోడిపుంజు బయట ఉంటే కుక్కలు దాడిచేసే అవకాశముందని భావించిన సీఐ రమేశ్‌బాబు దాన్ని లాకప్‌లో పెట్టి గింజలు, నీరు ఏర్పాటు చేయించారు. ఠాణాకు వెళ్లినవారంతా లాకప్‌లో ఉన్న కోడిపుంజును ఆసక్తిగా చూశారు. సీఐని వివరణ కోరగా భద్రత కల్పించేందుకే లాకప్‌లో పెట్టినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని