logo

అన్నదానం నిధుల రికవరీ

ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 23 Apr 2024 03:36 IST

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న ‘అన్నదానం నిధులు పక్కదారి’ పేరుతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. క్షేత్రంలోని నిత్యాన్నదాన సత్రంలో విధులు నిర్వహించిన శంకర్‌ అన్నదాన విరాళాలను పక్కదారి పట్టించినట్లు గుర్తించిన అధికారులు గత 12 రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ఎట్టకేలకు రూ.6.16 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం రూ.3 లక్షలు బ్యాంకు (నిత్యాన్నదాన)ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన పూర్తి స్థాయి నగదును మరో 15 రోజుల్లోపు చెల్లించే విధంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిధులను పక్కదారి పట్టించిన శంకర్‌ను ప్రస్తుతం విధుల నుంచి తొలగించినట్లు దేవస్థాన ఛైర్మన్‌ కందూరి సుధాకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని