logo

భారత్‌లో ఓటు ప్రస్థానమిదీ..

ఆంగ్లేయుల పాలనలో మండలాలను ఫిర్కాలుగా పిలిచేవారు. అప్పట్లో ఫిర్కాకు కార్‌కోన్‌ అనే హోదాలో ఓ ఉద్యోగి విధులు నిర్వహించేవారు.

Updated : 03 May 2024 06:11 IST


మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : ఆంగ్లేయుల పాలనలో మండలాలను ఫిర్కాలుగా పిలిచేవారు. అప్పట్లో ఫిర్కాకు కార్‌కోన్‌ అనే హోదాలో ఓ ఉద్యోగి విధులు నిర్వహించేవారు. గ్రామస్థాయిలో ఈ ఉద్యోగి వీఎం మేజిస్ట్రేట్‌గా వ్యవహరించేవారు. ప్రజలు వీరి వద్ద ఓటు నమోదు చేసుకునేవారు. అప్పట్లో ఉద్యోగులు, విద్యావంతులు, భూస్వాములకు మాత్రమే ఆంగ్లేయులు ఓటుహక్కు కల్పించారు. బహిరంగంగా చేతులెత్తి ఓటుహక్కు వినియోగించుకునే విధానం అమలు చేశారు. కాలక్రమేణ ఓటు వేసే విధానంలో మార్పులు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఒక్కో పెట్టె(బ్యాలెక్‌ బాక్స్‌)ను బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసేవారు. ఓటరు నచ్చిన అభ్యర్థి పెట్టె వద్దకు వెళ్లి ఓటు వేసేవారు. ఈ విధానంపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అభ్యర్థులు ఎంతమంది ఉన్నా పెట్టె ఒకటే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పట్లో 70 శాతానికి మించి పోలింగ్‌ జరిగితే రిగ్గింగ్‌ జరిగిందని భావించి అధికారులు రీపోలింగ్‌ నిర్వహించేవారు. 1967 తర్వాత రహస్య ఓటింగ్‌ విధానం అమల్లోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని