logo

ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎం.విజయ్‌కుమార్‌ తెలిపారు.

Published : 23 Apr 2024 03:38 IST

ఐఎస్‌వో గుర్తింపు సర్టిఫికెట్లు అందుకుంటున్న ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ తదితరులు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎం.విజయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం కళాశాల సెమినార్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.శివయ్య చేతుల మీదుగా ఐఎస్‌వో సర్టిఫికెట్‌ అందుకున్నట్లు చెప్పారు. గ్రీన్‌, ఎనర్జీ ఆడిట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ పాటించినందుకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ ఎన్టీఆర్‌ కళాశాలను వరించిందన్నారు. ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే ఈ గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ అమీనా ముంతాజ్‌ జహాన్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డా.టి.విజయలక్ష్మి, అకాడమిక్‌ కోఆర్డినేటర్స్‌ ఆర్‌.లావణ్య, సురయ్య జబీన్‌, లైబ్రేరియన్‌ ఆంజనేయులు, అధ్యాపకులు డా.మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని