logo

దామరగిద్దలో వివాహిత దారుణహత్య

దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది.

Published : 28 Apr 2024 04:37 IST

మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం

సవిత(35) పాత చిత్రం

దామరగిద్ద, న్యూస్‌టుడే : దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. ముఖంపై యాసిడ్‌ పోసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు, ఎందుకు హత్య చేశారనే విషయం తెలియరావడం లేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై వసంత తెలిపారు. గడిమున్‌కన్‌పల్లికి చెందిన సవితకు ఎనిమిదేళ్ల క్రితం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన భాస్కర్‌తో పెళ్లయ్యింది. అయిదేళ్ల బాబు, పాప ఉన్నారు. దామరగిద్దలో కుటుంబం నివాసం ఉంటోంది. మూడురోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిన యువతి దామరగిద్దలో ఎనికల్‌ లక్ష్మప్ప ఇంట్లో మృతదేహమై పడిఉంది. ఇంటికి తాళం వేసుకుని మూడురోజుల క్రితమే పెళ్లికి వెళ్లానని, ఇంటి తాళం పగలగొట్టి ఎవరో మృతదేహం వేశారని లక్ష్మప్ప శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దామరగిద్ద ఎస్‌ఐ వసంత, నారాయణపేట సీఐ శివశంకర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. మృతురాలి భర్త భాస్కర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. భాస్కర్‌ నారాయణపేటలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. భార్య, పిల్లలు దామరగిద్దలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం తన భార్య ఇంటి నుంచి వెళ్లిన విషయాన్ని భాస్కర్‌ ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. తన కుమార్తె హత్య ఎందుకు జరిగిందో, హంతకులు ఎవరో తేల్చాలని మృతురాలి తల్లి సాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎవరు, ఎందుకు హత్య చేశారనే విషయం తెలియరావడం లేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై వసంత తెలిపారు. గడిమున్‌కన్‌పల్లికి చెందిన సవితకు ఎనిమిదేళ్ల క్రితం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన భాస్కర్‌తో పెళ్లయ్యింది. అయిదేళ్ల బాబు, పాప ఉన్నారు. దామరగిద్దలో కుటుంబం నివాసం ఉంటోంది. మూడురోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిన యువతి దామరగిద్దలో ఎనికల్‌ లక్ష్మప్ప ఇంట్లో మృతదేహమై పడిఉంది. ఇంటికి తాళం వేసుకుని మూడురోజుల క్రితమే పెళ్లికి వెళ్లానని, ఇంటి తాళం పగలగొట్టి ఎవరో మృతదేహం వేశారని లక్ష్మప్ప శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దామరగిద్ద ఎస్‌ఐ వసంత, నారాయణపేట సీఐ శివశంకర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. మృతురాలి భర్త భాస్కర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. భాస్కర్‌ నారాయణపేటలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. భార్య, పిల్లలు దామరగిద్దలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం తన భార్య ఇంటి నుంచి వెళ్లిన విషయాన్ని భాస్కర్‌ ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. తన కుమార్తె హత్య ఎందుకు జరిగిందో, హంతకులు ఎవరో తేల్చాలని మృతురాలి తల్లి సాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని