logo

క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం

భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్‌సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు,

Published : 28 Apr 2024 04:43 IST

ఎమ్మెల్సీ  బల్మూరి వెంకట్‌

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే : భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్‌సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ భరోసానిచ్చారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్యకర్తలు చొరవతో కృషి చేసి అభ్యర్థి మల్లురవికి భారీ మెజార్టీని కట్టబెట్టాలన్నారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భారాస నుంచి పోటీ చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి, పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని