logo

ప్రతి ఫిర్యాదును అంతర్జాలంలో నమోదు చేయాలి: ఎస్పీ

ఠాణాలకు వచ్చే ప్రతి ఫిర్యాదును అంతర్జాలంలో నమోదు చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు స్టేషన్‌లో

Published : 18 Jan 2022 02:40 IST

సూర్యాపేటలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌. పాల్గొన్న ఠాణాల రిసెప్షనిస్టులు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: ఠాణాలకు వచ్చే ప్రతి ఫిర్యాదును అంతర్జాలంలో నమోదు చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్‌ వర్టికల్‌ సిబ్బందికి నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫిర్యాదులపై వెంటనే ప్రాథమిక విచారణ నిర్వహించి బాధితులకు భరోసా కల్పించాలన్నారు. జిల్లా పోలీసులు ఐక్యంగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, ఐటీ కోర్‌ ఎస్సై శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

పోలీసు ప్రజావాణికి 12 ఫిర్యాదులు..

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజావాణిలో మొత్తం 12 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. భార్య, భర్తలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని