logo

NTR: నల్గొండ బరి.. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ మెజార్టీని అందుకోలేకపోయారు!

నీలగిరి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌దే అత్యధిక ఓట్ల మెజార్టీగా రికార్డు నమోదైంది.

Updated : 27 Oct 2023 09:12 IST

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: నీలగిరి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌దే అత్యధిక ఓట్ల మెజార్టీగా రికార్డు నమోదైంది. 1957లో ఏర్పాటైన నల్గొండ అసెంబ్లీకి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 1985లో నల్గొండ బరిలో తెదేపా అభ్యర్థిగా ఎన్టీఆర్‌ నిలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి మందడి రాంచంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 49,788 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థికి 18,201 ఓట్లు వచ్చాయి. 31587 ఓట్లు మెజార్టీతో ఎన్టీఆర్‌ విజయం సాధించారు. ఎన్టీఆర్‌ తర్వాత 1994లో సీపీఎం అభ్యర్థి నంద్యాల నర్సింహారెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి చకిలం శ్రీనివాస్‌పై 29163 ఓట్ల అధిక్యతతో గెలుపొందాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి తన సమీప పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై 23698 ఓట్ల మెజార్టీ సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డిపై 22738 ఓట్ల మెజార్టీ తేడాతో విజయం సాధించారు. నీలగిరి చరిత్రలో 1957-2018 వరకు పరిశీలిస్తే కాంగ్రెస్‌, సీపీఎం ఎమ్మెల్యేలు ఎవరూ ఎన్టీఆర్‌ సాధించిన మెజార్టీని అందుకోలేక పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని