logo

పంచనారసింహులకు భక్తుల పూజలు

పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి.

Published : 28 Apr 2024 06:19 IST

అలంకార జోడు సేవ

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. మూలవరులను మేల్కొల్పి హారతితో కొలిచారు. పంచామృతంతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. భక్తులకు దర్శనమిచ్చే కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన జరిపారు. ఆలయ మహాముఖ మండపంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పర్వాలు కొనసాగాయి. అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో నిర్వహించారు. అలంకార సేవోత్సవం జరిపారు. జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య మడవీధులలో ఊరేగించారు.  క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామిని కొలుస్తూ సహస్రనామార్చన నిర్వహించారు. వివిధ విభాగాల నుంచి రూ.35,10,162 నిత్యాదాయం సమకూరిందని ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని