logo

తొలి రోజు పది నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 19 Apr 2024 04:18 IST

కోవూరులో ఉద్రిక్తత

ఈనాడు, నెల్లూరు: కోవూరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అసెంబ్లీ స్థానాలకు 9, ఎంపీ స్థానానికి ఒకరు వేశారు. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా మహబూబ్‌బాషా నామినేషన్‌ వేయగా- కావలి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆమె భార్య ఆదిలక్ష్మి, బహుజన సమాజ్‌ పార్టీ నుంచి గుంచి వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు.

కోవూరులో తెదేపా తరఫున వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైకాపా తరఫున నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి రజత్‌రెడ్డి నామినేషన్‌ వేయగా.. నెల్లూరు రూరల్‌లో తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తరఫున నాయకురాలు భానుశ్రీ నామినేషన్లు సమర్పించారు. ఆత్మకూరులో యుగ తులసి పార్టీ నుంచి నెల్లూరు కృష్ణారెడ్డి, ఉదయగిరిలో స్వతంత్ర అభ్యర్థి చెరుకూరి వేణుగోపాల్‌ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. తొలిరోజు కోవూరు నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా నాయకులు తమ అధినేతలకు మద్దతుగా నినాదాలు చేయగా... ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. కొద్దిసేపటికి వివాదం సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని