logo

ఏకకాలంలో రుణమాఫీ

రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 28 Apr 2024 05:45 IST

మెండోరాలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి

బాల్కొండ, మోర్తాడ్‌, ఏర్గట్ల, న్యూస్‌టుడే: రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారంలో పంద్రాగస్టు లోపు రాష్ట్రంలో రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. మెండోరా, దూద్‌గాం, ఏర్గట్లలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌ నుంచి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తుందని చెప్పారు.  కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వమన్నారు. భాజపా రైతు రుణమాఫీ చేయమంటే ఆలోచిస్తుందని, అదే అదానీ, అంబానీలకు మాఫీ చేస్తుందన్నారు. మేడిగడ్డ కుంగిపోవడంతో ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మోర్తాడ్‌ ప్రజానిలయంలో మాట్లాడుతూ.. రిజర్వేషన్లను తొలగించే కుట్ర భాజపా చేస్తోందని ఆరోపించారు. అర్వింద్‌ నిజాం చక్కెర కర్మాగారాన్ని ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. రైతులను మళ్లీ మభ్యపెట్టేందుకు పసుపు బోర్డు అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌కుమార్‌, విత్తన అభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, మెండోరా, బాల్కొండ, ఏర్గట్ల మండలాల పార్టీ అధ్యక్షులు ముత్యంరెడ్డి, వెంకటేష్‌గౌడ్‌, రాములు, సోమారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని