logo

స్కాన్‌ చేయండి... వివరాలు తెలుసుకోండి

ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది.

Published : 29 Apr 2024 04:40 IST

ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ అమలు చేస్తోంది. ఓటరు చీటీపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. వీటిని ప్రస్తుతం బీఎల్‌వోలు ఇంటింటికి పంచుతున్నారు. క్యూఆర్‌ స్కానర్‌ ద్వారా ఓటరు పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశముంది. ఓటర్స్‌ ఈసీఐ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగినై ఓటరు పేరు వివరాలతో పాటు ఎపిక్‌ సంఖ్య, క్రమ సంఖ్య, పోలింగ్‌ స్టేషన్‌ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ పొందుపర్చారు. రూట్‌ మ్యాప్‌ కూడా ముద్రించారు. చీటీలు పంచుతున్న బీఎల్‌వోలు ప్రతిఒక్కరు ఓటు వేయాలని అవగాహన కల్పిస్తున్నారు.

  న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని