logo

20 క్వింటాల ఇప్ప పువ్వు స్వాధీనం

జిల్లాలో ఆబ్కారీ, పోలీసు అధికారులు ముమ్మరంగా  తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Published : 29 Apr 2024 13:12 IST

పర్లాఖెముండి : జిల్లాలో ఆబ్కారీ, పోలీసు అధికారులు ముమ్మరంగా  తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రాయగడ ఠాణా పరిధిలోని  ఇన్‌స్పెక్టర్‌  దయానిధి భారిక్, ఏఎస్సై లక్ష్మీదేవి, సిబ్బందితో  పొర్సల్ గ్రామ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  వ్యాన్‌లో తరలిస్తున్న 50 బస్తాల ఇప్ప పువ్వును పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  అక్రమ సారా తయారీకి నువాగడ గ్రామం నుంచి రాయగడ వైపునకు ఇప్ప పువ్వును రవాణా చేస్తున్న నువాగడ గ్రామానికి సాగర్ పాయిక్(26), ఖగేష్  పాయిక్(21)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పట్టుబడిన 50 బస్తాల ఇప్ప పువ్వు  20 క్వింటాళ్లు ఉంటుందని,  దీని విలువ సుమారు రూ.60 వేలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని