logo

ప్రముఖుల పుస్తకంలో రాచర్ల వాసికి చోటు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..మన్‌కీబాత్‌లో గుర్తించిన ప్రముఖుల వంద మంది చిత్రాలతో విడుదల చేసిన పుస్తకంలో రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.రాంభూపాల్‌రెడ్డికి చోటు దక్కింది.

Published : 15 Jun 2023 05:47 IST

పైనుంచి ముడో వరుసలో ఎడమ నుంచి మొదటి వ్యక్తి రాంభూపాల్‌రెడ్డి

రాచర్ల, న్యూస్‌టుడే : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..మన్‌కీబాత్‌లో గుర్తించిన ప్రముఖుల వంద మంది చిత్రాలతో విడుదల చేసిన పుస్తకంలో రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.రాంభూపాల్‌రెడ్డికి చోటు దక్కింది. గత రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన మొత్తం పోస్టాఫీసు లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసి ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒక సారి పంచాయతీ లోని 100 మంది పేద బాలికల విద్య కోసం సుకన్య యోజన పథకంలో బాలికల అకౌంట్లలో జమ చేస్తున్నారు. గత 9సంవత్సరాలుగా మన్‌ కీ బాత్‌లో ప్రధాని మాట్లాడిన వారితో ప్రముఖంగా 100మందిని గుర్తించి ఒక వారి చేసిన కార్యక్రమాలపై ఒక ఆల్బమ్‌ తయారు చేసి ముద్రించారు. ఇందులో ఈయన చిత్రం, ఈయన చేసిన సేవలను ప్రచురించారు. ఈ పుస్తకం కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో విడుదల చేసి ప్రముఖ వ్యక్తులకు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని