logo

వైద్య విద్యార్థులకు కరోనా!

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థుల్లో కొందరికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి వీరికి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తారని

Published : 18 Jan 2022 06:20 IST

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థుల్లో కొందరికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి వీరికి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తారని విద్యార్థులు భావించారు. కానీ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటించడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సునీల్‌నాయక్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ పరీక్షల వాయిదాకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని, మంగళవారం నుంచి నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చివారు ఆ నివేదికను తమకు చూపిస్తే ప్రత్యేకంగా పరీక్ష రాయిస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని