logo

స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..

 సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన  నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి   పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది

Published : 19 Apr 2024 04:54 IST

తొలిరోజు నామినేషన్లకు దూరంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు

పలాసలో నామినేషన్ల కోసం ఎదురు చూస్తున్న రిటర్నింగ్‌ అధికారి భరత్‌నాయక్‌, ఇతర అధికారులు

 ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన  నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. వీరంతా ముహూర్తాలు కుదరక దూరంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నాలుగుచోట్ల నామపత్రాలు దాఖలు చేశారు.

నాలుగుచోట్ల ఆరుగురు

పలు శాసనసభ స్థానాల పరిధిలో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఒక్కటీ నమోదు కాలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా ఆమదాలవలసలో ఇద్దరు, ఎచ్చెర్లలో ఇద్దరు, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు చొప్పున వేశారు.

పార్లమెంట్‌ స్థానానికి ఒక్కటీ లేదు..

శ్రీకాకుళం పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ రెండు స్థానాలు కలెక్టర్‌ కార్యాలయంలో ఉండటంతో బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ గణేష్‌ నామినేషన్‌ సమయం పూర్తయ్యే వరకు అక్కడే వేచి ఉండి కలెక్టర్‌ కార్యాలయంలోనికి వస్తున్న వాహనాలు, వ్యక్తులను ఆరా తీసి లోపలకు పంపారు. ఎక్కడా ఎలాంటి ఘటనలు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని