logo

రిజర్వేషన్‌ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్‌

రిజర్వేషన్‌ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్‌ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్‌ ప్రకటన విడుదల చేశారు.

Published : 25 Apr 2024 00:15 IST

చెన్నై, న్యూస్‌టుడే: రిజర్వేషన్‌ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్‌ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్‌ ప్రకటన విడుదల చేశారు. అందులో.. దేశంలో సామాజిక న్యాయం నెలకొల్పడంలో తమిళనాడు కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ పెంచడానికి ‘ఇండియా’ కూటమి చర్యలు చేపడుతుందని తెలిపారు. 50శాతం రిజర్వేషన్‌ పరిమితి కన్నా అదనంగా ప్రస్తుతం రాష్ట్రంలోని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 69శాతం రిజర్వేషన్‌ అందించడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్‌ కింద అనుమతించినవారికి పూర్తి ఆర్థికసాయంతో, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వృత్తివిద్య కోర్సుల్లో 7.5శాతం రిజర్వేషన్‌నూ ఇటీవల అందించినట్లు తెలిపారు. క్రైస్తవ మతానికి మారిన జాబితాలోని కులాలవారికి రిజర్వేషన్‌ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసినట్లూ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో డీఎంకే సిద్ధాంతాలు చాలావరకు ప్రతిబింబించడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి హామీలను రానున్న ప్రభుత్వం ఆసక్తితో నెరవేరుస్తుందని గట్టిగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని