logo

ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం

కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు.

Published : 04 May 2024 06:31 IST

కలశంపై పుణ్యజలాలు పోస్తున్న శంకర విజయేంద్ర సరస్వతి స్వామి

కాంచీపురం, న్యూస్‌టుడే: కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. పనులు ముగియడంతో శుక్రవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. మూడు రోజులుగా మఠం ప్రాంగణంలో యాగశాల పూజలు భరణీధరశాస్త్రి నేతృత్వంలో 20 మంది వేదపండితులు, రుత్వికులు నిర్వహించారు. శుక్రవారం యాగశాల పూజలు పూర్తి కావడంతో పూర్ణాహుతి నిర్వహించారు. దీపారాధన అనంతరం కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. యాగశాలలో ఉంచిన పుణ్యజలాలతో ఆదిశంకరుడు, శ్రీఅనుక్కై గణపతి, సరేశ్వరాచార్యుల సన్నిధుల గోపుర కలశాలకు దీపారాధన, మూలమూర్తులకు అభిషేకాలు చేశారు. కుంభాభిషేకంలో ముల్లై వాసల్‌ కృష్ణమూర్తి, చెన్నై ఐఐటీ డైరెక్టరు కామకోటి సహా పలువురు ప్రముఖులు, శంకరమఠం భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను మఠం శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, మేనేజర్‌ సుందరేశ అయ్యర్‌, సిబ్బంది పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని