logo

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్లు వెంటనే రైలును నిలిపివేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగి నుంచి కిందికి దిగేశారు. ఈ ఘటన

Published : 22 Jan 2022 02:48 IST

బోగీలో నుంచి పొగలు వస్తున్న దృశ్యం

నెక్కొండ, న్యూస్‌టుడే: ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్లు వెంటనే రైలును నిలిపివేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగి నుంచి కిందికి దిగేశారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వివరాల ప్రకారం.. నెక్కొండ రైల్వే స్టేషన్‌ రెండో నెంబరు ప్లాట్‌ఫాం మీదుగా తక్కువ వేగంతో విశాఖపట్టణం నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెంబర్‌ 20805) ఇంజిన్‌ నుంచి.. రెండో బోగీ ఎస్‌6లో బ్రేక్‌ల వద్ద సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో నిప్పురవ్వలతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో నిప్పురవ్వలను అదుపు చేశారు. అరగంట పాటు శ్రమించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం ప్రయాణికులు అదే బోగీలోకి ఎక్కారు. రైలు యథావిధిగా ప్రయాణం కొనసాగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని