logo

సింహాచలంలో అపచారం!

సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసే సమయంలో అర్చకుడు ముఖానికి వస్త్రం చుట్టుకోక పోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జరిగే కరాళ చందన సమర్పణ నేపథ్యంలో

Published : 12 Aug 2022 06:36 IST

ముఖానికి వస్త్రం చుట్టుకోకుండా సుగంధ ద్రవ్యాల మిళితమా అంటూ విమర్శలు

చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తున్న అర్చకుడు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసే సమయంలో అర్చకుడు ముఖానికి వస్త్రం చుట్టుకోక పోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జరిగే కరాళ చందన సమర్పణ నేపథ్యంలో సిబ్బంది అరగదీసిన చందనంలో అర్చకులు గురువారం సుగంధ ద్రవ్యాలు మిళితం చేశారు. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో దేవస్థానం సిబ్బంది వీడియో తీస్తుండగా సంబంధిత అర్చకుడు మాట్లాడడంపై విమర్శలు తలెత్తాయి. ఆ సమయంలో నోటిలోని తుంపర్లు చందనంలో పడే అవకాశం ఉందని పలువురు తప్పు పట్టారు. ఎంతో పవిత్రంగా జరిగే చందన సమర్పణలో అర్చకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అర్చకుడు సీతారామాచార్యులు వివరణ కోరగా.. స్వామివారి కైంకర్యంలో భాగంగానే ఎప్పుడూ జరిగే విధంగానే సుగంధ ద్రవ్యాలు మిళితం చేసే ప్రక్రియ చేపట్టామన్నారు. ఇప్పుడిది కొత్తగా జరిగేది కాదని స్పష్టం చేశారు. పవిత్ర హృదయంతో చేసే పనిపై ఉద్దేశపూర్వకంగా నిందలు వేయడం సరికాదన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని