logo

మోసయ్యపేటలో వైకాపా దౌర్జన్యకాండ

అచ్యుతాపురంలోని మోసయ్యపేట పోలింగ్‌ కేంద్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులపై దౌర్జన్యానికి దిగారు.

Published : 14 May 2024 05:05 IST

వైకాపా, కూటమి నాయకుల తోపులాట
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురంలోని మోసయ్యపేట పోలింగ్‌ కేంద్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులపై దౌర్జన్యానికి దిగారు. ఓటు వేయడానికి బంధువైన వృద్ధుడిని తీసుకెళ్తున్న చిట్టిబాబు అనే యువకుడిని పోలింగ్‌ కేంద్రంలోకి రాకుండా వైకాపా ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. దీనిపై కూటమికి చెందిన ఏజెంట్లు మీరు తీసుకొస్తే న్యాయమా? మేం తీసుకొస్తే అన్యాయమా? అని ప్రశ్నించారు. దీంతో పోలింగ్‌ వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సమాచారం కేంద్రం వెలుపల ఉన్న వైకాపా నాయకులకు అందించడంతో వారంతా ఒకేసారి వచ్చి కూటమి నాయకులపై దాడికి దిగారు. పోలింగ్‌ కేంద్రంలో ఇటుకలను ఒకరిపై ఒకరు విసురుకొని భౌతికదాడులకు దిగారు. అందరూ చూస్తుండగా కొట్టుకుంటూ పోలింగ్‌ బూత్‌ నుంచి వైకాపా నాయకులు బయటకు వచ్చారు. ఈ కొట్లాటలో కూటమికి చెందిన పుర్రే రాజు చెయ్యి విరిగిపోయింది. ఈ ఘటనతో ఓటర్లు పరుగులు తీశారు. సమస్యాత్మక గ్రామమైనా ఒకే ఒక కానిస్టేబుల్‌ను బందోబస్తుకు ఉంచారని, గట్టి చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని కూటమి నాయకులు పుర్రే శ్రీను మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతో వైకాపా నాయకులు కొట్లాటకు దిగారని ఆయన ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని