logo

ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం

ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు.

Updated : 20 Apr 2024 04:32 IST

నక్కపల్లి, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. సారిపల్లిపాలెంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా అయిదేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. సోమవారం తాను నామినేషన్‌ వేస్తున్నట్లు వివరించిన ఆమె కార్యక్రమానికి భారీగా తరలిరావాలని కోరారు. అంతకుముందు చందనాడలో వైకాపాకు చెందిన పలువురు అనిత సమక్షంలో తెదేపాలోకి చేరారు. ఎస్‌.రాయవరం మండలం వమ్మవరంలో వైకాపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ సర్పంచి దోసపాత్రుని హనుమంతరావు తన అనుచరులతో కలిసి అనిత, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన అంతంకావడానికి సమయం దగ్గరపడిందన్నారు. తెదేపా మండల అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌, అమలకంటి అబద్ధం నేతలు తోట నగేష్‌, కురందాసు నూకరాజు, గింజాల లక్ష్మణరావు పాల్గొన్నారు.

వమ్మవరం, గెడ్డపాలెం గ్రామాల్లో అనిత ఇంటింటి ప్రచారం చేపట్టారు. మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, నల్లపరాజు వెంకటరాజు, తన్నీరు ఎరకయ్య పాల్గొన్నారు.


జబర్దస్త్‌ నటులకు సత్కారం

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్‌ నటులు ఆటో రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను, ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌లను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. వీరిని జనసేన కార్యాలయంలో కొణతాల రామకృష్ణ, తెదేపా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని