logo

ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు

జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు.

Published : 20 Apr 2024 03:44 IST

కార్పొరేషన్‌, వన్‌టౌన్‌, ఎంవీపీ కాలనీ, న్యూస్‌టుడే: జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. రెండో రోజు శుక్రవారం విశాఖ దక్షిణం, గాజువాక నియోజకవర్గాలకు ఎవరూ నామపత్రాలు  అందజేయలేదు. భీమిలిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, తూర్పునకు తెదేపా తరఫున రెండు సెట్లు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ఒక నామపత్రం సమర్పించారు. ఉత్తర నియోజవర్గానికి వైకాపా రెండు సెట్లు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఒక సెట, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామపత్రాలు దాఖలు చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి వైకాపా నుంచి రెండు సెట్లు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి ఒక సెట అందజేశారు. పెందుర్తికి వైకాపా నుంచి ఒకటి, జనసేన నుంచి రెండు, జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి ఒకటి, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ఒకటి, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా నలుగురు ఒక్కో సెట నామపత్రాలు సమర్పించారు.

అట్టహాసంగా: తూర్పు తెదేపా అభ్యర్థి వెలగపూడి నామినేషన్‌ పర్వం అట్టహాసంగా సాగింది. శుక్రవారం ఉదయం ఎంవీపీకాలనీ తెదేపా కార్యాలయానికి భారీ సంఖ్యలో నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో అభిమానులు తరలిరావటంతో ఎంవీపీకాలనీలోని అన్ని రహదారులు రద్దీగా మారాయి. రిటర్నింగ్‌ అధికారి కె.మయూర్‌ అశోక్‌కు వెలగపూడి రామకృష్ణబాబు నామపత్రం సమర్పించారు. అయితే.. నామినేషన్‌కు వచ్చే వారికి అడ్డంకులు సృష్టించారని ఎమ్మెల్యే వెలగపూడి ఆరోపించారు.  నాయకులకు, కార్యకర్తలకు ఆటోలు దొరకని పరిస్థితి సృష్టించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని