logo

ముగిసిన హస్తకళలపై శిక్షణ

పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్‌స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది.

Published : 23 Apr 2024 04:24 IST

తీర్చిదిద్దిన హస్తకళలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్‌స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. పాఠశాల ఛైర్మన్‌ పి.సూర్యనారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన నైల్‌ అండ్‌ థ్రెడ్‌ హస్తకళ నిపుణులు మోహానీడు, గీత, తదితరుల ఆధ్వర్యంలో హస్తకళలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా తీర్చిదిద్దిన వస్తువులను ప్రదర్శించారు. ప్రిన్సిపల్‌ సీతాలక్ష్మి, సీఈవో నిశాంత్‌, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని