logo

పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు.

Published : 23 Apr 2024 04:26 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. పెందుర్తి మండలంలో పదకొండు ప్రభుత్వ పాఠశాలున్నాయి. ఆయా పాఠశాలల నుంచి 1,127 మంది పరీక్షలకు హాజరు కాగా, 9,40 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ మేరకు మండలంలో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రయివేటు పాఠశాలల నుంచి 1,582 మంది పరీక్షలకు హాజరు కాగా 1,553 మంది ఉత్తీర్ణత నమోదు చేశారు.

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట, నరవ, చింతలగ్రహారం జడ్పీ పాఠశాలల్లో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. వేపగుంట జడ్పీ పాఠశాలలో 149 మంది విద్యార్థులకు 129 మంది.. నరవ జడ్పీ పాఠశాలలో 163 మందికి 149 మంది చింతలగ్రహారం జడ్పీ పాఠశాలలో 93 మందికి 86 మంది ఉత్తీర్ణులయ్యారు.

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండల విద్యాశాఖ పరిధిలోని 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి పదోతరగతి పరీక్షలు 836 మంది పరీక్షలు రాయగా 748 మంది ఉత్తీర్ణత సాధించారు.

సబ్బవరం, న్యూస్‌టుడే: సోమవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సబ్బవరం మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని