Vizag steelplant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Published : 25 Apr 2024 19:59 IST

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన భూములు, యంత్రాలు, ఇతర ఆస్తులను విక్రయించబోమంటూ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) నరసింహశర్మ చెప్పిన వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. కర్మాగారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100శాతం పెట్టుబడులను మాత్రమే  ఉపసంహరిస్తున్నామని ఏఎస్‌జీ కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ వేసేందుకు సమయం కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం జూన్‌ 19కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని