logo

కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి

కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 03:54 IST

సమావేశంలో మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

సుజాతనగర్‌(పెందుర్తి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. పెందుర్తి అసెంబ్లీ కూటమి(జనసేన) అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు అధ్యక్షతన ఆదివారం జీవీఎంసీ 97వ వార్డు పరిధిలోని సుజాతనగర్‌, గిరిప్రసాద్‌నగర్‌, గోపాలకృష్ణనగర్‌, వెంకటాద్రినగర్‌, సీ-2 జోన్‌, 70 ఫా€్లట్్స అపార్టుమెంట్‌ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ మాట్లాడుతూ కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల ఆవశ్యత గురించి వివరించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, 97వ వార్డు కార్పొరేటర్‌ శానాపతి వసంత, 88వ వార్డు కార్పొరేటర్‌ మొల్లి ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఒక్కరోజు కష్టపడి ఓటేయండి

వేపగుంట, న్యూస్‌టుడే: పోలింగ్‌ రోజున ప్రతీ ఓటరు ఎండైనా, వానైనా కష్టపడి ఓటు వేసి తమను గెలిపిస్తే ఐదేళ్లు పాటు ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. సింహపురికాలనీలో పలు కాలనీ సంఘాల సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా దౌర్భాగ్యపు పాలన నుంచి విముక్తి పొందాలంటే విజ్ఞులైన ఓటర్లంతా కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పద్మావతినగర్‌ రెసిడెన్సియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, సింహపురికాలనీ అసోసియేషన్‌, వర్షిణి అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ సభ్యులు, బాలాజీ హిల్‌వ్యూ అపార్ట్‌మెంట్‌ వాసులు సీఎం రమేశ్‌ను ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కార్పొరేటర్లు బల్ల శ్రీనివాసరావు, పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు.

వేపగుంట శివాలయం వీధిలో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలు

 పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు, అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి సీఎం రమేశ్‌ విజయం సాధిస్తారని 94వ వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు అన్నారు. వార్డు పరిధి శివాలయం వీధి, పైడిమాంబ కాలనీల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. కార్పొరేటర్‌ బల్ల శ్రీనివాసరావు, వార్డు జనసేన అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి, నామాల అరుణ, యర్రానాగరాజు, శానాతి దేముడు తదితరులు పాల్గొన్నారు.

పరవాడ, న్యూస్‌టుడే: పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు మద్దతుగా జీవీఎంసీ 77వ వార్డు పరిధి మద్దివానిపాలెం, పలికిలివానిపాలెం, గొరుసువానిపాలెం, బూసువానిపాలెం గ్రామాల్లో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా, జనసేన నేతలు పాల అచ్చిలనాయుడు, కాకి గోవిందరెడ్డి, కాకిబాబు, కాకి శ్రీను, నక్క శ్రీను ఇంటింటికీ తిరిగి కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ.భోనంగి ఫార్మాసిటీ కాలనీలో తెదేపా సీనియర్‌ నేత అట్టా సన్యాసిఅప్పారావు, జనసేన నాయకుడు బుగిడి గోవింద ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. గాజు గ్లాసు, కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని