logo

అనకాపల్లి లోక్‌సభ నుంచి15మంది పోటీ!

అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Published : 30 Apr 2024 03:49 IST

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణలో 22 నామినేషన్లకు ఏడుగురు అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి సమక్షంలో ఉపసంహరించుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ నిర్వహించారు. భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌, బూడి ముత్యాలనాయుడు (వైకాపా), వేగి వెంకటేశ్‌ (కాంగ్రెస్‌)తో పాటు, పలక శ్రీరామమూర్తి (బహుజన సమాజ్‌వాదీ పార్టీ), ఆడారి శరత్‌చంద్ర (జై భారత్‌ పార్టీ), వడ్లమూరి కృష్ణస్వరూప్‌ (దళిత బహుజన పార్టీ), నమ్మి అప్పలరాజు (భారత చైతన్య యువజన), కర్రి విజయలక్ష్మి (పిరిమిడ్‌), సిద్ద లోవరాజు, వంకాయల రామచం‌్రë¢రావు, తుమ్మగంట అప్పలనాయుడు, తుమ్మపాల హరిశంకర్‌, గార సూర్యారావు, జున్నూరి శ్రీనివాస్‌, పెట్ల నాగేశ్వరరావు బరిలో మిగిలారు. వీరిలో దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణస్వరూప్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవితో పాటు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలిచ్చినా అదే గుర్తు వేరే వారికి కేటాయించడం సరికాదన్నారు.

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు 69 మంది పోటీ!

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని మాడుగుల, పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ తరవాత 69 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మాడుగులలో 11 నామినేషన్లలో ఇద్దరు,  పాయకరావుపేటలో 10 నామినేషన్లకు ఒక్కరు, ఎలమంచిలిలో 14 నామినేషన్లకు నలుగురు, చోడవరంలో 8 నామినేషన్లకు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనకాపల్లిలో 12  మంది, నర్సీపట్నంలో 8 మంది అభ్యర్థులు చివరికి బరిలో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని