logo

విశాఖ లోక్‌సభ బరిలో 33 మంది అభ్యర్థులు

విశాఖ లోక్‌సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ  చేశారు.

Published : 30 Apr 2024 03:50 IST

మూడు ఈవీఎంలు వినియోగించాల్సిన పరిస్థితి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ లోక్‌సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ  చేశారు. నామపత్రాలను 39 మంది దాఖలు చేయగా ఆరుగురివి తిరస్కరణకు గురయ్యాయి. 33 మంది మిగలగా ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. నోటాతో కలిపితే 34 మందితో బ్యాలెట్‌ పేపరు రానున్నది. ఒక బ్యాలెట్‌ యూనిట్‌(ఈవీఎం)లో 16 పేర్లకు అవకాశం ఉంది. ఈ లెక్కన 34 పేర్లకు 3 ఈవీఎంలు వినియోగించాల్సి ఉంది.

పోటీలో ఉన్నది : ఎం.శ్రీభరత్‌ (తెదేపా), బొత్స ఝాన్సీ (వైకాపా), పి.సత్యనారాయణరెడ్డి (కాంగ్రెస్‌), పెదపెంకి శివప్రసాద్‌ (బీఎస్‌పీ), ఎ.విజయభాస్కర్‌ (ఇండియా ప్రజాబంధు పార్టీ), మురపాల అచ్యుత్‌ కిరణ్‌బాలాజీ (భారత చైతన్య యువజన పార్టీ), డాక్టర్‌ గణపతి కొంగారపు (ఆర్‌పీఐ), గణపతి జగదీశ్వరరావు (జై మహాభారత్‌), గుంటు దుర్గాప్రసాద్‌ (భారతీయ రాష్ట్రీయదళ్‌), గండికోట రాజేష్‌ (నవతరం), చింతాడ సూర్యం (నభ భారత నిర్మాణ సేవ), విజయకుమారి జాలాది (సమాజ్‌వాదీ), తోట వెంకటసాయి ముకుంద్‌ (ప్రజా ప్రస్తానం), ఆనంద్‌ కిలారి (ప్రజాశాంతి), బన్నా రమేష్‌ (దళిత బహుజన), బిక్కవోలు చల్మాజీ (నవరంగ కాంగ్రెస్‌), వండరసింగ సత్యనారాయణ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌), పి.సత్యవతి (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), స్వతంత్ర అభ్యర్థులుగా అరుణశ్రీ మురాల, జీఏఎన్‌ ఆనంద్‌, కొల్లి నాగార్జున, మహమ్మద్‌ గౌస్‌మొహిద్దీన్‌ఖాన్‌, చప్పిడి రాము, జనార్దన్‌ పొన్నాడ, పి.అప్పారావు, మళ్ల శ్రావణి, మెట్టా రామారావు, లడుగు గోవిందరావు, వడ్డి హరిగణేష్‌, కర్రి వేణుమాధవ్‌, దేవర శంకర్‌, వాసుపల్లి సురేష్‌, క్రిష్ణ సొండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని